సాహో ఫైనల్ కట్ ఎంత వచ్చిందంటే

మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో ఆగస్టు 30 న భారీగా రిలీజ్ అవుతుంది. సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్ గా తీసారని అర్ధం అవుతుంది. ప్రతి [more]

Update: 2019-08-15 08:20 GMT

మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో ఆగస్టు 30 న భారీగా రిలీజ్ అవుతుంది. సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్ గా తీసారని అర్ధం అవుతుంది. ప్రతి సీన్ రిచ్ గా రావాలంటే చాలానే డబ్బులు ఖర్చు పెటుంటారు ప్రొడ్యూసర్స్. మరి అవి ఎడిటింగ్ టేబుల్ మీద లెగసిపోతే ఎంత బాధ ఉంటుంది? పైగా ఇరవై నిమిషాల నిడివి తగ్గించారు. ఈ ఎడిటింగ్ ఏదో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కి ముందు చేసిన బాగానే ఉండేది. కానీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అన్ని కంప్లీట్ చేసుకున్న తరువాత సినిమా లో బోర్ అనిపించే సీన్స్ అన్ని లేపేసారట.

మొదట ఈమూవీ ఫైనల్ కట్ మూడు గంటల వరకు రావడంతో అంత రన్‌ టైమ్‌ వుంటే ల్యాగ్‌ వుందనే కామెంట్స్‌ వస్తాయని భావించి తీసేశారట. దీని వల్ల ఎంతో డబ్బు వృధా అయినా కానీ నిర్మాతలు దానిని లెక్క చేయలేదు. ఫైనల్ కట్ చూసుకుని హ్యాపీ గా ఫీల్ అయ్యారట. చేతులు కాలాక ఆకులు పెట్టుకుంటే ఏం లాభం. ఆఫ్టర్ ఎడిటింగ్ రెండు గంటల నలభై నిమిషాల దగ్గరకి ఫైనల్‌ రన్‌టైమ్‌ తీసుకొచ్చారు. ఈచిత్రం ఓవరాల్ బడ్జెట్ 350 కోట్లు ప్రభాస్ ఓ ఇంటర్వ్యూ లో ప్రకటించాడు

Tags:    

Similar News