ప్రభాస్ ని భయపెడుతుంది ఏది?

ప్రభాస్ అన్నట్టు సాహో టైం స్టార్ట్ అయిపోయింది. మరో మూడు వారాల్లో సాహో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనుంది. ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా [more]

Update: 2019-08-16 05:49 GMT

ప్రభాస్ అన్నట్టు సాహో టైం స్టార్ట్ అయిపోయింది. మరో మూడు వారాల్లో సాహో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనుంది. ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా నటిస్తున్న ఈసినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేసాడు. ప్రతి సీన్ రిచ్ గా ఉండేటట్టు సుజీత్ ఈమూవీ ని తెరకెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సాహో వివిధ బాషల్లో రిలీజ్ కావడం అందులోనూ ఒక్క ఇండియాలోనే 7 వేల స్క్రీన్లలో మొదటి రోజు షోలు ప్లాన్ చేయడం ఒకరకంగా ప్లస్ గా అనిపిస్తున్నప్పటికీ దానికి సంబంధించి అతి పెద్ద డేంజర్ మరొకటి పొంచి ఉంది. అదే పైరసీ.

ఏ సినిమాకి అయినా పైరసీ అనేది ఈమధ్య కామన్ అయిపోయింది. ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆ పైరసీ భూతం ని మాత్రం ఆపలేకపోతున్నారు. పైగా ఇటువంటి పెద్ద సినిమాకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి తోడు ఈసినిమాకి దగ్గరదగ్గరగా 350 కోట్లు ఖర్చయినట్టు ప్రభాస్ ఓ ఇంటర్వ్యూ చెప్పాడు. ఈమూవీ వరల్డ్ వైడ్ గా నలుమూలల విడుదల ఉంటుంది. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడకం పెరిగాక పైరసీ వీరులు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఇటువంటి పరిస్థితిల్లో వరల్డ్ లో ఏ మూల నుండైనా ఒక ప్రింట్ బయటకు వచ్చినా చాలు దానికి అన్ని భాషలు లింక్ చేసి వదిలేస్తారు. మరి సాహో చిత్ర యూనిట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో? ప్రస్తుతం ప్రభాస్ తో పాటు టీం మొత్తాన్ని భయపెడుతున్న అంశం ఇదే .

Tags:    

Similar News