యావరేజ్ టాక్ తో దర్బార్ ఫస్ట్ డే కలెక్షన్స్

రజినీకాంత్ – మురుగదాస్ అపూర్వ కలయికలో తెరకెక్కిన దర్బార్ సినిమా నిన్న గురువారం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. సంక్రాతి సీజన్ లో తోలి సినిమాగా తెలుగు [more]

Update: 2020-01-10 05:45 GMT

రజినీకాంత్ – మురుగదాస్ అపూర్వ కలయికలో తెరకెక్కిన దర్బార్ సినిమా నిన్న గురువారం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. సంక్రాతి సీజన్ లో తోలి సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబ్బింగ్ దర్బార్ మొదటి రోజు యావరేజ్ టాక్ తోనే థియేటర్స్ వద్ద సందడి చేసింది. భారీ అంచనాల మధ్యన భారీగా విడుదలైన దర్బార్ కి ప్రేక్షకులే కాదు… రివ్యూ రైటర్స్ కూడా యావరేజ్ టాక్ ఇచ్చారు. రజిని అభిమానులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాగా దర్బార్ మూవీ కూడా మిగిలిపోయింది. మురుగదాస్ మార్క్ డైరెక్షన్స్ కానీ, కథ కానీ లేకపోవడం దర్బార్ మెయిన్ లోటు. రజినీకాంత్ స్టయిల్, ఎనర్జీ నటన, స్టైలిష్ యాక్షన్, నేపధ్య సంగీతం అన్ని బావున్నప్పటికీ… సినిమాకి కథ లేని లోటు స్పష్టంగా కనబడింది. మరి ఈ టాక్ టోన్ దర్బార్ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 4.41 కోట్లు కొల్లగొట్టింది.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 2.03
సీడెడ్ 0.66
నెల్లూరు 0.18
కృష్ణ 0.24
గుంటూరు 0.40
వైజాగ్ 0.44
ఈస్ట్ గోదావరి 0.28
వెస్ట్ గోదావరి 0.18

టోటల్ ఏపీ & టీస్ షేర్: 4.41

Tags:    

Similar News