రజిని రేంజ్ ఎవరు అందుకుంటారు

సౌత్ లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల్లో ఫస్ట్ ప్లేస్ లో రజినీకాంత్ ఉంటాడు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధమే లేకుండా రజినీకాంత్ సినిమాల మార్కెట్ ఉంటుంది. [more]

Update: 2019-11-10 04:11 GMT

సౌత్ లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల్లో ఫస్ట్ ప్లేస్ లో రజినీకాంత్ ఉంటాడు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధమే లేకుండా రజినీకాంత్ సినిమాల మార్కెట్ ఉంటుంది. ఇప్పటివరకు వరసగా అరడజను సినిమాలు ప్లాప్ అయినా.. రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే పనులు మానుకుని ఎదురు చూసే పిచ్చి అభిమాన గణం రజిని సొంతం. అందుకే ఆయన క్రేజ్ కూడా కోట్లలోనే ఉంటుంది. తాజాగా రజినీకాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన దర్బార్ సినిమా మోషన్ పోస్టర్ తో సినిమాపై భారీ అంచనాలే వచ్చాయి. చాలా స్టైలిష్ గా రజినీకాంత్ దర్బార్ లో కనిపిస్తున్నాడు.

ఇక తాజాగా దర్బార్ సినిమాకి షాకింగ్ బడ్జెట్ పెట్టారని.. అయితే సినిమా బడ్జెట్ కన్నా రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎక్కువ అనే న్యూస్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రజినీకాంత్ సినిమాకి 40 నుండి 50 కోట్ల పారితోషకం అందుకుంటాడు. అంటే దర్బార్ బడ్జెట్ రజినీకాంత్ పారితోషకం కన్నా తక్కువ అంటే ఏ 35 నుండి 40 కొట్లో ఉంటుందన్నమాట. అయితే రజినీకాంత్ దర్బార్ సినిమాకి 60 కోట్లు పైనే తీసుకుంటున్నాడని అంటున్నారు. మరి రజిని మార్కెట్ దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఆయనకి అడిగింది ఇచ్చేసుకుంటున్నారు. ఇక దర్బార్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసారు.

Tags:    

Similar News