ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ను లాక్ చేసుకున్న రామబాణం, ఉగ్రం
ఈరోజే థియేటర్లలో విడుదలైన ఈ రెండు సినిమాలు తమ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్ నర్స్ ను లాక్ చేసుకున్నాయి. రామబాణం సినిమా
ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్తసినిమాలు విడుదలవుతుంటాయి. వీటిలో అప్పుడపుడు కొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా ఉంటాయి. ఈ శుక్రవారం (మే 5) థియేటర్లలో విడుదలైన రెండు ప్రధానమైన సినిమాలు రామబాణం, ఉగ్రం. ఈ ఇద్దరు హీరోలు తమకు కలిసొచ్చిన డైరెక్టర్లతోనే సినిమాలు తీయడం విశేషం. గోపీచంద్ కు లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ ఈసారి రామబాణంతో వచ్చాడు. అలాగే నరేష్ కు నాందితో.. విభిన్నమైన కథతో తొలిహిట్ కు నాంది పలికి విజయ్ కనకమేడల ఈసారి ఉగ్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈరోజే థియేటర్లలో విడుదలైన ఈ రెండు సినిమాలు తమ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్ నర్స్ ను లాక్ చేసుకున్నాయి. రామబాణం సినిమా డిజిటల్ హక్కులను సోనీలివ్ సంస్థ కొనుగోలు చేయగా.. ఉగ్రం డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలు థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఓటీటీల్లోకి రానున్నాయి. థియేటర్లకు ధీటుగా ఓటీటీలు కూడా ప్రతివారం సరికొత్త కంటెంట్ తో సినిమాలతోనే కాకుండా.. వెబ్ సిరీస్ తోనూ వినోదాన్ని పంచుతున్నాయి.