నయనతారకు షాక్.. సరోగసీపై కమిటీ ఏర్పాటు చేసిన తమిళ సర్కార్
సోషల్ మీడియా వేదికగా..నయన్- విఘ్నేశ్ లు తల్లిదండ్రులైన విషయంపై జరుగుతున్న రచ్చపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి..
ప్రముఖ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ లు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. పెళ్లై నాలుగు నెలలు అయిందో లేదో.. తాము కవల పిల్లలకు తల్లిదండ్రులమయ్యాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులతో నెట్టింట పెద్ద దుమారమే రేగింది. పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులు ఎలా అయ్యాయంటూ నెటిజన్లు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు వారిద్దరూ సరోగసీ ద్వారా పేరెంట్స్ అయ్యారన్న వాదన తెరపైకి వచ్చింది.
సోషల్ మీడియా వేదికగా..నయన్- విఘ్నేశ్ లు తల్లిదండ్రులైన విషయంపై జరుగుతున్న రచ్చపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ స్పందించారు. ఈ విషయంపై నయన్ దంపతులు వివరణ ఇవ్వాలని తెలిపారు. అలాగే.. సరోగసీ వివాదంపై తమిళ సర్కారు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నయన్ సరోగసీపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సరోగసీ విధానం ద్వారా పిల్లలను కనడంపై నిషేధాన్ని విధించింది. వారికి గర్భందాల్చే అవకాశం లేని పక్షంలోనే సరోగసీ ఆప్షన్ ను తీసుకోవాలని చట్టం చేసిన విషయం తెలిసిందే.