త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇస్తాడా..?

మహేష్ – సుకుమార్ కాంబోపై గత ఆరు నెలలులుగా ఏదో ఒక వార్త మీడియాలో నానుతూనే ఉంది. అనేక ప్రచారాల తర్వాత మహేష్.. సుకుమార్ మూవీకి మంగళం [more]

Update: 2019-03-06 11:24 GMT

మహేష్ – సుకుమార్ కాంబోపై గత ఆరు నెలలులుగా ఏదో ఒక వార్త మీడియాలో నానుతూనే ఉంది. అనేక ప్రచారాల తర్వాత మహేష్.. సుకుమార్ మూవీకి మంగళం పాడేశాడు. ఇక సుకుమార్ సీక్రెట్ గా అల్లు అర్జున్ కి కథ చెప్పి ఒప్పించి సినిమాపై అధికారిక ప్రకటన ఇప్పించేసాడు. మరి మరోపక్క అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబో పై కూడా ఇలాంటి కథనాలే మీడియాలో వినబడుతున్నాయి. త్రివిక్రమ్ మాట మీదే అన్నీ జరుగుతున్నాయని, బన్నీ మాట త్రివిక్రమ్ వినడం లేదని అంటున్నారు. మరోపక్క కథ బాగా రావడానికి త్రివిక్రమ్ చాలా కష్టపడుతుండగా.. ఫుల్ స్క్రిప్ట్ తోనే సెట్స్ మీదకెళదామని బన్నీ పట్టుబడుతున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పటివరకు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రమే పూర్తి చేసాడు

త్రివిక్రమ్ కు నొ చెప్పినట్లే..!

ఇక త్రివిక్రమ్ టైంకి కథ సిద్ధం చెయ్యకపోగా… అనుకోకుండా సుకుమార్ తో కనెక్ట్ అయిన అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చేసి సుకుమార్ తో సెట్స్ మీదకు వెళ్లిపోవచ్చనే ప్రచారం స్టార్ట్ అయ్యింది. మరి మహేష్ కి.. సుకుమార్ హ్యాండ్ ఇచ్చి అల్లు అర్జున్ కి కమిట్ అయితే.. ఇప్పుడు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కి హ్యాండిచ్చి సుకుమార్ తో సినిమా మొదలు పెట్టినా మొదలు పెట్టొచ్చు అంటూ ఊహాగానాలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.

Tags:    

Similar News