త్రివిక్రమ్ – బన్నీ సినిమాలో గొప్ప నటుడు..!

ఇండియాలో గర్వించదగ్గ నటుల్లో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఒక్కరు. నటనపరంగా ఎటువంటి ఎమోషన్ అయినా చాలా అవలీలగా పండించగలరు. రీసెంట్ గా ఆయన తమిళ చిత్రం [more]

;

Update: 2019-03-25 08:48 GMT
allu arjun gap with producers
  • whatsapp icon

ఇండియాలో గర్వించదగ్గ నటుల్లో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఒక్కరు. నటనపరంగా ఎటువంటి ఎమోషన్ అయినా చాలా అవలీలగా పండించగలరు. రీసెంట్ గా ఆయన తమిళ చిత్రం ‘కాలా’లో విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు. అందులో నానా యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు నానా పటేకర్ తెలుగు సినిమాలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీలో. ప్రస్తుతం వీరి కాంబినేషన్ ఓ మూవీ తెరకెక్కబోతుంది.

అల్లు అర్జున్ సినిమాలో…

ఈ మూవీ తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా. ఒక కీలక పాత్ర కోసం నానా పటేకర్ ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు అనుకున్నట్లు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా ఇటువంటి సబ్జెక్టే. కానీ ఈసారి తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్సే ప్రధానాంశంగా సినిమా ఉంటుందట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నారు. గీత ఆర్ట్స్ పై ఈ మూవీ రూపొందుతుంది.

Tags:    

Similar News