సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

అనారోగ్యానికి గురైన ఆయనను కుటుంబ సభ్యులు పోరూర్ రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న..;

Update: 2023-02-19 11:14 GMT
tamil actor mayilsamy

tamil actor mayilsamy

  • whatsapp icon

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి.. ఇప్పటి వరకూ ఎందరో సీనియర్ నటీనటులు అశువులు బాశారు. నిన్న నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళురు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ ఆర్.మయిల్ స్వామి (57) ఆదివారం (ఫిబ్రవరి 19) ఉదయం కన్నుమూశారు.

అనారోగ్యానికి గురైన ఆయనను కుటుంబ సభ్యులు పోరూర్ రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మయిల్ స్వామి ఆరోగ్యం మరింత విషమించడంతో కన్నుమూశారు. మయిల్ స్వామి ఎన్నో తమిళ సినిమాల్లో కమెడియన్ గా చేశారు. స్టాండప్ కమెడియన్‌గా, టీవీ హోస్ట్‌గా, థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1984లో ‘ధవని కనవుగల్‌’ సినిమాతో అరంగేట్రం చేశారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో సుమారు 200 సినిమాలకు పైగా నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులతోపాటు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News