హెడ్డింగ్ రాసిపెట్టుకోండి.. వాల్తేరు వీరయ్య రొటీన్ ఎంటర్టైనర్.. లోపలికెళ్లాక ?
మనం ఎప్పుడూ ఇంట్లో మన అమ్మమ్మలు, అమ్మ దగ్గరనుంచి రోజూ అదే భోజనం చేస్తాం. అలాగని అది రొటీన్ భోజనం..
2023 సంక్రాంతి బరిలోకి దిగుతున్న ప్రధాన సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి. జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం (డిసెంబర్ 28) సాయంత్రం చిత్రబృందం స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా రొటీన్ ఎంటర్టైనరా లేక కొత్తదనం ఏదైనా ఉందా అని మీడియా మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నించగా.. ఆయన దీనిపై సాలిడ్గా స్పందించారు.
''ఈ సినిమా రొటీన్ ఎంటర్టైనర్ అని హెడ్డింగ్ రాసిపెట్టుకోండి.. కానీ.. లోపలికి వెళ్లిన తరువాత షాక్ తినే ఎమోషన్ కూడి ఉంటుంది. మనం ఎప్పుడూ ఇంట్లో మన అమ్మమ్మలు, అమ్మ దగ్గరనుంచి రోజూ అదే భోజనం చేస్తాం. అలాగని అది రొటీన్ భోజనం అని మనం అనుకోం. కానీ ఆ రోజున స్పెషల్ ఐటెమ్స్ ఏముంటాయని.. ఆ భోజనాన్ని ఎంత రుచిగా ఎంజాయ్ చేశామనే చూస్తాం.'' వాల్తేరు వీరయ్య కూడా అలాంటి సినిమానే అంటూ చిరంజీవి మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కాగా.. వాల్తేరు వీరయ్యలో బాబీ తనను ఎలా చూపించాలనుకున్నాడో.. సినిమా చూస్తే తెలుస్తుందన్నారు. సినిమాలో తీసుకున్న ప్రతిక్యారెక్టర్ కు అందరూ సరిగ్గా సరిపోయారని తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్, బాస్ పార్టీ సాంగ్లో ఊర్వశి రౌటేలా తమ అందంతో అయస్కాంతంలా లాగేస్తారని చిరు చెప్పుకొచ్చారు.