ఏంటి విషయం నయన్?
నయనతార తమిళనాట స్టార్ హీరోయిన్. కెరీర్ తొలినాళ్లలోనే హీరో శింబుతో ప్రేమాయణం నడిపిన నయనతార పెళ్లి వరకు వచ్చిన ఆ ప్రేమకి గుడ్ బయ్ చెప్పేసింది. తర్వాత [more]
నయనతార తమిళనాట స్టార్ హీరోయిన్. కెరీర్ తొలినాళ్లలోనే హీరో శింబుతో ప్రేమాయణం నడిపిన నయనతార పెళ్లి వరకు వచ్చిన ఆ ప్రేమకి గుడ్ బయ్ చెప్పేసింది. తర్వాత [more]
నయనతార తమిళనాట స్టార్ హీరోయిన్. కెరీర్ తొలినాళ్లలోనే హీరో శింబుతో ప్రేమాయణం నడిపిన నయనతార పెళ్లి వరకు వచ్చిన ఆ ప్రేమకి గుడ్ బయ్ చెప్పేసింది. తర్వాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమ పెళ్లి అంటూ యవ్వారం నడపడమే కాదు… ప్రభుదేవా భార్య రమలతకి విడాకులు కూడా ఇచ్చేసాడు. కానీ వాళ్ళ ప్రేమ కూడా బ్రేకప్ అయింది. తాజాగా నమ్మకం లేకనే.. ప్రేమలో రెండుసార్లు మోసపోయా అని చెప్పింది.
ఇక మూడో రిలేషన్ షిప్ లో ఉన్న నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఐదేళ్లుగా సహజీవనం చేస్తుంది. కానీ పెళ్లి ఊసెత్తడం లేదు. సినిమాలకు షికార్లకు, విదేశాల్లో బర్త్ డే పార్టీలు అమ్మో చాలానే చేసున్నారు కానీ… పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. తాజాగా నయనతార మూడో ప్రేమ కూడా బ్రేక్ అప్ అయ్యి కథ కంచికి చేరింది అని ప్రచారం మొదలయ్యింది. కొంతకాలంగా నయనతార – విగ్నేష్ శివన్ ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారని.. ఎవరికి వాళ్ళే విడిగా ఉండాలని ఇప్పటికే డిసైడ్ అయ్యి.. విడివిడిగా ఉంటున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంటే.. అటు నయనతార కానీ, ఇటు విగ్నేష్ శివన్ కానీ ఏ మాత్రం స్పందించడం లేదు.