నమ్మకం లేకనే ప్రేమలో రెండుసార్లు ఓడిపోయా?

కోలీవుడ్ లో లేడి సూపర్ స్టార్ నయనతారకున్న క్రేజ్ కుర్ర హీరోయిన్స్ కి కూడా లేదు. స్టార్ హీరో లేంటి, కుర్ర హీరోలనంటే, లేడి ఓరియెంటెడ్ సినిమాలేంటి [more]

Update: 2020-04-13 07:16 GMT

కోలీవుడ్ లో లేడి సూపర్ స్టార్ నయనతారకున్న క్రేజ్ కుర్ర హీరోయిన్స్ కి కూడా లేదు. స్టార్ హీరో లేంటి, కుర్ర హీరోలనంటే, లేడి ఓరియెంటెడ్ సినిమాలేంటి నయనతార తర్వాతే ఎవరైనా. సినిమాల్తో ఎప్పుడూ బిజీగా ఉండే నయనతార ప్రేమలోనూ బిజినె. మొదట్లో హీరో శింబు తో ప్రేమ వ్యవహారం నడిపిన నయనతార తర్వాత దర్శకుడు, కొరియోగ్రాఫేర్ ప్రభుదేవాతో ప్రేమా పెళ్లి అంటూ హడవిడి చేసి మధ్యలోనే వదిలేసి.. మళ్ళీ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతూ సహజీవనం చేస్తున్న నయనతార తన రెండు ప్రేమలో ఎందుకు విఫలమయ్యిందో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ప్రేమ అంటే నమ్మకం అని… నమ్మకం లేని చోట ప్రేమ ఉండదని చెబుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడు కలిసి జీవించడం ఎందుకు.. విడిపోవడమే బెటర్ అంటుంది. రెండుసార్లు తన ప్రేమ విఫలం కావడానికి ప్రేమలో నమ్మకం లేకపోవడమే అంటుంది నయనతార. ఆ నమ్మకం లేకనే శింబు, ప్రభుదేవాతో బంధాన్ని తెంచుకున్నా అని.. ప్రేమలో విఫలమైనప్పుడు ఎంతో నరకం అనుభవించ అని.. కానీ బయట మాత్రం ఎవరిష్టమొచ్చినట్లుగా వారు మాట్లాడారని… ఆ బాధ నుండి బయటికి రావడానికి చాలా కాలం పట్టుంది అని చెబుతుంది నయనతార. ఆ బాధ నుండి తేరుకోవడానికి  వరస సినిమాలు చేశా అని.. ఆ సినిమాలే తనని మనిషిని చేసాయి అంటుంది. 

Tags:    

Similar News