"ఇండియా కూటమి" భేటీ
ఇండియా కూటమి నాలుగోసారి సమావేశమవుతుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ సమావేశంలో జరుగుతుంది
ఇండియా కూటమి నాలుగోసారి సమావేశమవుతుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ సమావేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు మాత్రమే హాజరవుతారు. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో ముందస్తు పొత్తులపై చర్చించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో విపక్షాల బలాబలాల ప్రకారం పొత్తులను నిర్ణయించే అవకాశముంది. ఇప్పటి వరకూ మూడు సార్లు ఇండియా కూటమి సమావేశమయింది. పాట్నా, బెంగళూరు, ముంబయిలో జరిగిన సమావేశాల్లో రానున్న ఎన్నికల్లో ఐక్యతగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ముంబయి సమావేశంలోనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.
రానున్న ఎన్నికల్లో...
రానున్న ఎన్నికల్లో మోదీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈరోజు జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్లు కావస్తుండటంతో సహజంగా తలెత్తే వ్యతిరేకతను సమర్థవంతంగా ఎలా క్యాష్ చేసుకోవాలన్న దానిపై మేధోమధనం చేయనున్నారు. పొత్తులతో పాటు వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు మ్యానిఫేస్టో ఎలా ఉండాలన్న దానిపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంటుందని చెబుతున్నారు మోదీపై సమరానికి సిద్ధం కావడానికి కావాల్సిన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ఇండియా కూటమి నేటి సమావేశం తర్వాత మరింత ఐక్యతగా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి.