ఆఖరి పీరియడ్.. భారీ శబ్దం, ప్రకాశవంతమైన కాంతి
ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో స్కూల్ పై పిడుగు పడింది. గరద్‌పూర్ బ్లాక్‌లోని కుదనగారి
ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో స్కూల్ పై పిడుగు పడింది. గరద్‌పూర్ బ్లాక్‌లోని కుదనగారి హైస్కూల్ పై పిడుగు పడింది. ఈ ప్రమాదకర ఘటనలో 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను అమృత పాండా, అద్యాషా లక్ష్మి సమల్‌గా గుర్తించారు. వీరిని చిక్సిత కోసం తొలుత పాటకురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి)కి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కేంద్రపరా జిల్లా ప్రధాన ఆసుపత్రి (డిహెచ్‌హెచ్)కి తరలించారు.క్షతగాత్రులంతా కుదనగారి ఆదర్శ విద్యాలయంలోని 6వ తరగతి విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన 16 మంది విద్యార్థుల్లో 14 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
పిడుగు పడగానే.. కొంతమంది విద్యార్థులు స్పృహ కోల్పోగా మరికొందరు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపాటుతో తమ తరగతి గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని బాధిత విద్యార్ధులు చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు వెంటనే గాయపడిన విద్యార్థులను పటాకురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రులకు చేరుకున్నారు.
చివరి పీరియడ్ జరుగుతున్న సమయంలో ప్రకాశవంతమైన కాంతిని చూశామని.. భారీ శబ్దం వినిపించిందని విద్యార్థులు చెప్పారు. కొంతమంది విద్యార్థులు వెంటనే స్పృహ కోల్పోగా, మరికొందరు వికారంగా ఉన్నట్లు ఫిర్యాదు చేశారు.