భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు తగ్గాయి. అయితే దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో

Update: 2023-08-01 02:13 GMT

ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు తగ్గాయి. అయితే దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈ మార్పు జరిగింది వాణిజ్య సిలిండర్ల ధరల విషయంలో..! చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు 1 ఉదయం వాణిజ్య సిలిండర్ల (ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర) ధరను రూ.100 తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌కు ఇప్పుడు రూ.1680 చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొత్త రేటు ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో మునుపటిలా రూ.1103 చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.1780 నుంచి రూ.1680కి తగ్గింది. కోల్‌కతాలో గతంలో రూ.1895.50 ఉండగా, ఇప్పుడు రూ.1802.50 చెల్లించాల్సి ఉంటుంది. ముంబైలో గతంలో రూ.1733.50కి లభించగా, ఇప్పుడు రూ.1640.50కి అందుబాటులోకి రానుంది. చెన్నైలో ధర రూ.1945.00 నుంచి రూ.1852.50కి తగ్గింది. మార్చి 1, 2023న.. సిలిండర్ ధర రూ.2119.50. ఆ తర్వాత ఏప్రిల్‌లో రూ.2028కి తగ్గగా, మేలో రూ.1856.50కి, జూన్ 1న రూ.1773కి చేరింది. అయితే దీని తర్వాత జూలైలో రూ.7 పెరగడంతో ఢిల్లీలో సిలిండర్ రూ.1780కి చేరింది.

భారత్, ఇండేన్, హెచ్‌పీ వంటి కంపెనీలు ఇప్పుడు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలను మాత్రమే తగ్గించగా..14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఈ సిలిండర్ రేటులో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో సిలిండర్ ధర దాదాపు రూ. 1155 వద్ద ఉంది. అలాగే ఏపీలో సిలిండర్ ధర దాదాపు ఇదే స్థాయిలో రూ. 1161 వద్ద కొనసాగుతోంది


Tags:    

Similar News