విషాదం.. లైటింగ్ ట్రస్ కూలి మోడల్ మృతి

ఈ ఘటనలో మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని..

Update: 2023-06-12 10:43 GMT

నోయిడాలోని ఫిల్మ్ సిటీ ప్రాంతంలో గల స్టూడియోలో ర్యాంప్ వాక్ చేస్తున్న మోడల్ వన్షిక పై లైటింగ్ ట్రస్ పడటంతో.. అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు మోడల్ వన్షిక చోప్రా, గాయపడిన వ్యక్తి బాబీ రాజ్ గా గుర్తించారు.

నోయిడాలో జరిగిన ఈ దురదృష్టకర ఫ్యాషన్ షోలో వీరిద్దరూ పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన యువతి గ్రేటర్ నోయిడా గౌర్ సిటీ-2 నివాసి అని తెలిసింది. షో నిర్వాహకులు, లైటింగ్ ట్రస్‌ ను అమర్చిన వ్యక్తిని పోలీసులు విచారించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.




Tags:    

Similar News