తన వెంట్రుకలను తానే తినేస్తుందట.. కడుపులో ఎన్ని కేజీలున్నాయంటే?

ఏదైనా తిన్నా వెంటనే వాంతులు అవుతూ ఉండడంతో

Update: 2024-10-07 04:30 GMT

2kg hair found in UP woman stomach

21 ఏళ్ల మహిళ కడుపు నుండి బరేలీలోని వైద్యులు విజయవంతంగా 2 కిలోగ్రాముల వెంట్రుకలను బయటకు తీశారు. రాపన్‌జెల్ సిండ్రోమ్ అని పిలిచే అరుదైన మానసిక స్థితితో ఆ మహిళ బాధపడుతూ ఉందని అధికారులు తెలిపారు. కర్గైనా నివాసి అయిన మహిళ 16 సంవత్సరాలుగా తన జుట్టును తినేస్తోంది. ఈ పరిస్థితిని వైద్యపరంగా ట్రైకోఫాగియా అని పిలుస్తారు. వెంట్రుకలు ఆమె కడుపు కుహరాన్ని నిండిపోయి, ఆమె ప్రేగులోని భాగాలకు కూడా విస్తరించాయి. అంతేకాకూండా ఆమె ఘన పదార్థాలను కూడా తీసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఏదైనా తిన్నా వెంటనే వాంతులు అవుతూ ఉండడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. CT స్కాన్‌ చేయగా కడుపులో వెంట్రుకలు పేరుకుపోయినట్లు తేలింది.

ఆ మహిళ ఐదేళ్ల వయసు నుంచి రహస్యంగా తన జుట్టును తింటూ ఉందని డాక్టర్లు తెలిపారు. ట్రైకోబెజోర్ అని పిలవబడే పెద్ద హెయిర్‌బాల్ ను శస్త్రచికిత్స చేసి వైద్య బృందం తొలగించింది. ఆమె చాలా కాలంగా జుట్టు లాక్కోవడం లాంటివి చేస్తూ ఉండేదని ఆ మహిళ కుటుంబం తెలిపింది. అయితే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. శస్త్ర చికిత్స తర్వాత ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం ఆమె మానసిక రుగ్మతను పరిష్కరించడానికి ఆసుపత్రిలో కౌన్సెలింగ్ ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ కేసును అసాధారణమైనదని వైద్యులు అభివర్ణించారు.
Tags:    

Similar News