Air India : సిక్ లీవులో ఎయిర్ ఇండియా సిబ్బంది.. 70 విమానాలు రద్దు

సిబ్బంది సిక్ లీవ్ పై వెళుతున్నట్లు తెలపడంతో ఎయిర్‌ఇండియాకు చెందిన 70 విమానాలు రద్దయినట్లు అధికారులు ప్రకటించారు.;

Update: 2024-05-08 04:34 GMT
air india flight, emergency, technical glitch, trichy airport
  • whatsapp icon

ఎయిర్ ఇండియాకు సీనియర్ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. సామూహికంగా సెలవు తీసుకున్నారు. సిక్ లీవ్ పై వెళుతున్నట్లు తెలపడంతో ఎయిర్‌ఇండియాకు చెందిన 70 విమానాలు రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారు ఏం చేయలేక ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. నిన్న రాత్రి నుంచి ఈరోజు వరకూ 70 విమానాల వరకూ రద్దయినట్లు అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ విమానాలు కూడా...
రద్దయిన విమానాల్లో దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలు కూడా ఉండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. చివరి నిమిషంలో సిక్ లీవ్ సామూహికంగా తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే రద్దయిన విమానాల్లో బుక్ చేసుకున్న వారికి నగదును రీఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు. తమ ప్రయాణ తేదీని మార్చుకున్న వారికి అవకాశం కల్పిస్తామని కూడా తెలిపారు.


Tags:    

Similar News