తమిళనాడులో నేడు సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పండగ ఉన్నప్పటికీ లాక్ డౌన్ యధాతధంగా అమలు చేయనున్నారు. దీంతో ఈరోజు తమిళనాడులో రహదారులన్నీ బోసి పోయాయి. కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
కేసుల సంఖ్య.....
అన్ని రహదారులన్నీ మూసివేశారు. ఫ్లై ఓవర్లను కూడా మూసివేశారు. హోటల్స్ ను తెరచి ఉంచినా కేవలం టేక్ అవే, ఫుడ్ డెలివరీకి మాత్రమే అనుమతించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. నిన్న ఒక్కరోజే తమిళనాడులో 23,978 కరోనా కేసులు నమోదయ్యాయి. మరింత కఠిన ఆంక్షల దిశగా ప్రభుత్వం చర్యలకు దిగనుంది.