హిమాచల్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రం లోని కుల్లూ జిల్లా మజాణ్ గ్రామంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.

Update: 2021-12-12 12:39 GMT

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ జిల్లా మజాణ్ గ్రామంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గ్రామంలోని 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు, 26 గోశాలలు అగ్నికి ఆహుతయ్యాయి. అధికారుల అంచనా మేరకు సుమారు రూ. 9 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

అకస్మాత్తుగా...
అగ్నిప్రమాదం సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. స్థానికుల ఇళ్లల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మంటలకు భయపడి ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కట్టుబట్టలు తప్ప తమకేమీ మిగల్లేదని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


Tags:    

Similar News