బ్రేకింగ్ : బలపరీక్ష వాయిదాకు శివసేన?
బలపరీక్షను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖాలు అయింది.
బలపరీక్షను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖాలు అయింది. బలపరీక్షకు తగిన సమయం ఇవ్వలేదని అంటూ పిటీషన్ శివసేన తరుపున దాఖలయింది. చీఫ్ విప్ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. బలపరీక్ష ను నిర్వహించాలంటూ గవర్నర్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. బలపరీక్షను రికార్డు చేయాలని ఆదేశించారు. దీంతో రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బలపరీక్షను వాయిదా వేయాలంటూ శివసేన పిటీషన్ వేయడం చర్చనీయాంశమైంది.
ఫ్లోర్ టెస్ట్ అవసరం లేదని...
అత్యవసరంగా బలపరీక్ష అవసరం లేదని శివసేన అభిప్రాయపడుతుంది. మరోవైపు సంజయ్ రౌత్ ఉద్దవ్ థాక్రేతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. శరద్ పవార్ కూడా బలపరీక్ష విషయంలో తమ మిత్ర పక్షాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. కోర్టు ఆదేశాలు వచ్చేంత వరకూ వేచి చూద్దామని శరద్ పవార్ చెప్పినట్ల తెలిసింది.
గోవాకు రెబల్ ఎమ్మెల్యేలు...
ఇక గౌహతిలో ఉన్న ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు నేడు గోవా రానున్నారు. గోవాలోని తాజ్ రిసార్ట్ లో ఇప్పటికే 70 రూములను బుక్ చేశారు. గోవా నుంచి నేరుగా ముంబయి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపీ కూడా తన ఎమ్మెల్యేలను క్యాంప్ లకు తరలిస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు బలపరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరినీ ముంబయిలోని ఒక హోటల్ బీజేపీ తరలించింది.