సుప్రీంకోర్టుకు చేరిన హిజాబ్ వివాదం
హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపేయాలని కోరుతూ నేడు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు.
హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపేయాలని కోరుతూ నేడు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తుది తీర్పు వచ్చేంతవరకూ విద్యాసంస్థల్లో యూనిఫారం మాత్రమే ధరించాలని, మతపరమైన దుస్తులు ధరించవద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయింది.
మధ్యంతర ఉత్తర్వులపై...
కర్ణాటకలో హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ఈ అగ్గి రాజుకుంది. దీనిపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తుది తీర్పు వచ్చేంత వరకూ కళాశాలల్లో యూనిఫారంలను మాత్రమే ధరించాలని పేర్కొంది. సోమవారం నుంచి విద్యాసంస్థలను తెరవాలని పేర్కొంది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు కావడంతో హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.