అరుదైన ఘటన.. తల్లీ కొడుకులిద్దరూ ఒకేసారి ఉత్తీర్ణత

కేరళలో అరుదైన సంఘటన జరిగింది. ఒకేసారి తల్లీ, కొడుకులకు ప్రభుత్వోద్యోగానికి అర్హత సాధించారు.

Update: 2022-08-12 12:11 GMT

కేరళలో అరుదైన సంఘటన జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఒకేసారి తల్లీ, కొడుకులకు ప్రభుత్వోద్యోగానికి అర్హత సాధించారు. ఇలాంటి సంఘటనలు అరుదైనవిగా చెబుతున్నారు. కేరళలోని మలప్పరానికి చెందిన బిందు తన కుమారుడితో కలిసి పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యారు. తల్లి బిందుకు 42 ఏళ్లు కాగా, కుమారుడు వివేక్ కి 24 ఏళ్లు. ఇద్దరూ కలసి ఒకే కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకున్నారు. తల్లీ కొడుకులిద్దరూ కలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరయ్యారు.

వయసుతో సంబంధం లేకుండా...
ిఇద్దరీకి ఒకేసారి ప్రభుత్వోద్యోగం వచ్చింది. తల్లి బిందుకు ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరిక. కుటుంబ పోషణ కన్నా సొంత కాళ్లమీద నిలబడాలన్న తపన ఎక్కువ. వయసుకు చదవుకు సంబంధం లేదని నిరూపించదలచుకున్నారామె. తనతో పాటు కొడుకు వివేక్ ను కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయాలని పట్టుబట్టింది. అందుకే ఇద్దరూ కలసి ఒకే కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందారు. ఇద్దరూ ఇంట్లో కంబైన్డ్ స్టడీస్ చేశారు. చివరకు ఇద్దరూ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించారు. రాష్ట్రంలో వీరిద్దరి ప్రతిభపై ప్రశంసలు కురుస్తున్నాయి.


Tags:    

Similar News