భారత్ లో వరుస భూకంపాలు
దేశంలో వరుస భూకంపాలు చోటుచేసుకున్నాయి. అసోం రాష్ట్రంలో, అండమాన్ నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు సంభవించాయి.
దేశంలో వరుస భూకంపాలు చోటుచేసుకున్నాయి. అసోం రాష్ట్రంలో, అండమాన్ నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు సంభవించాయి. అసోం రాష్ట్ర పరిధిలోని సోనిట్ పూర్ లో సోమవారం ఉదయం 8 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 15 కిలోమీటర్ల లోతులో భూ ప్రపంకనలు వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.
అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు వచ్చాయి. సోమవారం ఉదయం 7.48 గంటలకు భూకంపం రాగా దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఫైజాబాద్ లోనూ ఆదివారం భూ ప్రకంపనలు సంభవించాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. దేశంలోని శ్రీనగర్, పూంచ్, జమ్మూ, ఢిల్లీ ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది. ఇళ్లలో వస్తువులు ఊగుతూ కనిపించాయి. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.