ఎమ్మెల్యే మనవడిని... బైక్ పై స్టిక్కర్
తమిళనాడులో ఎమ్మెల్యే మనవడినంటూ స్టిక్కర్ వేసుకుని ఒక యువకుడు రోడ్లపై తిరుగుతుండటం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తమిళనాడులో ఎమ్మెల్యే మనవడినంటూ స్టిక్కర్ వేసుకుని ఒక యువకుడు రోడ్లపై తిరుగుతుండటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ మనవడినంటూ ఒక యువకుడు బైక్ పై స్టికర్ వేసుకుని తిరుగుగుతున్నారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఎమ్మెల్యేకు అసలే పెళ్లే కాలేదు. ఆయనకు మనవడు ఎక్కడి నుంచి వచ్చాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
డ్రైవర్ కొడుకు....
ఎంఆర్ గాంధీ నాగర్ కోయిర్ నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అయినా గెలవలేదు. 2021లో బీజేపీ తరుపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యే తన కారు డ్రైవర్ కన్నన్ ను కుటుంబ సభ్యుడిగా చూసుకుంటాడు. డ్రైవర్ కన్నన్ కుమారుడు అమ్రిష్ తాను ఎమ్మెల్యే మనవడి నంటూ బైక్ కు స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నాడు. సోషల్ మీడియాలో " నేను ఎమ్మెల్యే మనవడిని" అంటూ స్టిక్కర్ వేసుకుని తిరగడం చర్చనీయాంశమైంది.