ఆధార్ తో మీ పాన్ లింక్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి
ఇప్పటి వరకూ కేంద్రం 61కోట్ల మందికి పాన్ కార్డులను విడుదల చేయగా.. 48 కోట్ల మంది ఆధార్ తో పాన్ ను లింక్ చేసుకున్నారు.
ఆధార్ తో పాన్ నంబర్ ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుండో కోరుతోంది. అయినప్పటికీ.. చాలా మంది దానిపట్ల నిర్లక్ష్యం చేశారు. తొలుత ఆధార్ తో పాన్ లింక్ చేయడం పూర్తిగా ఉచితంగా ఇచ్చిన కేంద్రం.. ఇంకా చాలామంది అనుసంధానించుకోవాల్సి ఉండటంతో.. ఇప్పుడు రూ.1000 రుసుము పెట్టింది. ఉచితంగా ఇచ్చినపుడు పెద్దగా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకూ కేంద్రం 61కోట్ల మందికి పాన్ కార్డులను విడుదల చేయగా.. 48 కోట్ల మంది ఆధార్ తో పాన్ ను లింక్ చేసుకున్నారు. ఇంకా 13 కోట్ల మంది ఆధార్ తో లింక్ చేసుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు రూ.1,000 చెల్లించి మార్చి 31 వరకు లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆధార్-పాన్ అనుసంధానించుకోకపోతే మార్చి 31 తర్వాతి రోజు నుంచి పాన్ డీయాక్టివేట్ అయిపోతుంది. పాన్ నంబర్ పోతే.. పెట్టుబడులు, ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను చేసుకునే వీలుండదు. జీఎస్టీ రిటర్న్ దాఖలు చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మార్చి 31లోపు ఆధార్ తో పాన్ లింక్ చేసుకోవాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి కోరుతోంది. మీ ఆధార్ పాన్ తో లింక్ అయిందో లేదో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaarపోర్టల్ కు వెళ్లి పాన్ నంబర్, డెట్ ఆఫ్ బర్త్, క్యాపెచా ఇస్తే అనుసంధానం గురించిన సమాచారం చూపిస్తుంది.