300 యూనిట్ల కరెంట్ పై ఇక నో ఛార్జీ

ఈ ఏడాది చివరిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇటీవలే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల విజయం ఊపులో ఉన్న ఆప్‌

Update: 2022-07-21 15:27 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ ఉచిత హామీని ప్రకటించారు. గుజరాత్‌లోని అన్ని గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నగరాలు, గ్రామాలకు 24/7 విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. సూరత్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉచితంగా కరెంటు ఇవ్వడమే కాకుండా 2021 డిసెంబర్‌ 31 నాటికి ఉన్న పాత విద్యుత్‌ బకాయిలన్నీ కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి కోతలు పెట్టబోమని.. వ్యాపార, వాణిజ్య వినియోగదారులతో పాటు గృహాలకు కూడా నిరంతరాయ విద్యుత్‌ ను అందిస్తామని ప్రకటించారు.

ఈ ఏడాది చివరిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇటీవలే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల విజయం ఊపులో ఉన్న ఆప్‌ ను గుజరాత్‌ లో గెలిపించుకోవాలని కేజ్రీవాల్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గుజరాత్‌ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ''ఉచిత కరెంటు, నిరంతరాయ సరఫరాకు నేను గ్యారెంటీ. ఆప్‌ అధికారంలోకి రాగానే మేం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతాం. ఈ విషయంలో మేం ఎలాంటి తప్పిదం చేసినా.. ఆ తర్వాతి ఎన్నికల్లో ఆప్‌ కు ఓటు వేయకండి..'' అని కేజ్రీవాల్‌ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ఇలాంటి వాగ్దానాలు చేసి కాంగ్రెస్‌పై విజయాన్ని సాధించింది.


Tags:    

Similar News