ఎన్నికల వేళ కేజ్రీవాల్ సంచలన పిలుపు
గోవా ఎన్నికలు రేపు జరుగుతున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవిద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు;
గోవా ఎన్నికలు రేపు జరుగుతున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవిద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది మురిగిపోయినట్లేనని ఆయన చెప్పారు. గోవాలో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వాళ్లు బీజేపీ లో చేరతారని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. గోవాలో రేపు పోలింగ్ జరగనుంది. అక్కడ కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీలు గెలుపు కోసం పోటీ పడుతున్నాయి.
కాంగ్రెస్ కు వేస్తే....
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ మార్చి పదో తేదీన ఫలితాలు వెలువడుతాయని, మార్చి 11న కాంగ్రెస్ వాళ్లు బీజేపీలో చేరతారని అన్నారు. బీజేపీ ఓడిపోవాలనుకునే గోవా ప్రజలందరూ కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే వృధా చేసుకోవడమేనని గుర్తించాలని కోరారు. నిబద్ధతగా ఉండే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన కోరారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ బీజేపీలో చేరిన సంగతిని ఆయన గుర్తు చేశారు.