లెజెండరీ నటి జయప్రదకు జైలు శిక్ష

జయప్రదతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్ష విధించింది

Update: 2023-08-11 07:21 GMT

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఎగ్మోర్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్ష విధించింది చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు. వారికి 5000 రూపాయల జరిమానాను విధిస్తున్నట్లు తెలిపింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి అన్నారోడ్డులో సినిమా థియేటర్ ను నడిపించారు. సినిమా థియేటర్ లో పనిచేస్తున్న కార్మికుల నుండి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు కార్మికులు. వాళ్లకు రావాల్సిన మొత్తాన్ని ఇస్తానని.. ఈ పిటిషన్ ను కొట్టివేయాలని జయప్రద కోరగా.. అందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. ఎగ్మోర్ కోర్టు జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్షను విధించింది. కార్మికులకు అందాల్సిన మొత్తాన్ని చెల్లిస్తానని జయప్రద కోర్టుకు తెలిపారు. అందుకు లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలుశిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

సినీ, రాజకీయ రంగాల్లో చురుగ్గా పాల్గొన్న ఆమెకు చెన్నైలోని రాయపేటలో థియేటర్‌ను నడిపారు. మొదట్లో థియేటర్ కు ఆదరణ లభించినా.. ఆ తర్వాత ఆ తర్వాత ఆదాయం బాగా తగ్గడం మొదలైంది. ఇక ఆస్తి వివాదాలు కూడా చుట్టముట్టడంతో థియేటర్‌ను మూసివేశారు. చెన్నైకి చెందిన రామ్‌కుమార్‌, రాజబాబుతో కలిసి అన్నారోడ్డులో థియేటర్‌ను నడిపారు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఐ మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెల్లించలేదు. దీనికి సంబంధించి లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎగ్మూర్ కోర్టులో కేసు వేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో జయప్రద తదితరులు దాఖలు చేసిన మూడు పిటిషన్లు కొట్టివేశారు.


Tags:    

Similar News