మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం విజయం

మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం వరస విజయాలను అందుకుంటోంది.

Update: 2022-07-21 07:39 GMT

మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం వరస విజయాలను అందుకుంటోంది. తొలి దఫా జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల ఎంఐఎం అభ్యర్థులు గెలిచారు. రెండో దఫా జరిగిన ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం మూడు స్థానాల్లో విజయం సాధించడం విజయం. మధ్యప్రదేశ్ లో తొలిసారిగా ఎంఐఎం కాలుమోపింది. ఖార్ గావ్ మున్సిపల్ స్థానంలో ఎంఐఎం విజయం సాధించడం విశేషం.

వార్డు మెంబర్ గా...
ఖార్ గావ్ మున్సిపాలిటీలోని వార్డు నెంబరు 2లో ఎంఐఎం హిందూ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చింది. ఆమె పేరు అరుణ శ్యామ్ ఉపాధ్యాయ. ఆమె విజయం సాధించారు. తన భర్త శ్యామ్ ఉపాధ్యాయ ఉద్యమకారుడిగా పనిచేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఉండటంతో అరుణ సులువుగా గెలిచింది. మంత్రి విశ్వాస్ సారంగ్ ఇక్కడ తమ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేసినప్పటికీ ఆమె గెలుపు సాధ్యమయింది.


Tags:    

Similar News