హెలికాప్టర్ ప్రమాదంలో బయటపడిన ఒకే ఒక్కడు

హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారు.

Update: 2021-12-08 13:16 GMT

హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మరణించారు. హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ మృతి చెందారు. ఆయన భార్యతో పాటు మొత్తం 11 మంది ఈ ప్రమాదంలో మరణించారు. వరుణ్ సింగ్ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆయనకు అన్ని రకాలుగా వైద్యాన్ని అందిస్తున్నారు.

శౌర్య వీర చక్ర అవార్డు...
వరుణ్ సింగ్ ఇటీవల శౌర్య వీర చక్ర అవార్డును పొందారు. ఆయనను కాపాడేందుకు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ గా వరుణ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. ఈ ప్రమాదం పట్ల ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారాన్ని వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన రోజు అని వారు వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News