Delhi : మరింత పెరిగిన వాయు కాలుష్యం.. సర్కార్ కీలక నిర్ణయం
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి నాణ్యత మెరుపడకపోగా కాలుష్యం పెరిగింది
ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. దీంతో రాజధాని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి నాణ్యత మెరుపడకపోగా కాలుష్యం మరింత పెరిగింది. ఏక్యూఐ 400కి చేరుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గతంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో పాఠశాలలను కూడా మూసివేశారు. అవసరం ఉంటే తప్ప వాహనాలను బయటకు తీసుకురావద్దని కూడా సూచించారు. ప్రజా రవాణాను అంటే మెట్రో సేవలను ఎక్కువగా ఉపయోగించుకోవాలని, సొంత వాహనాలను మాత్రం రోెడ్డుపైకి తేకుండా వాయుకాలుష్యం మరింత ఎక్కువగా చూడాలని ప్రభుత్వం పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
న్యూ ఇయర్ వేడుకలకు...
అయితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గత దీపావళి సమయంలోనూ బాణాసంచా కాల్పడంపై నిషేధం విధించింది. ఎవరూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బాణాసంచా కాల్చవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల గాలి నాణ్యత మరింత క్షీణిస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వాయు కాలుష్యంతో ప్రజలు అనేక రోగాల బారిన పడే అవకాశముందని తెలిపింది.