నేటి నుంచి పాఠశాలలు బంద్

దేశ రాజధానిలో ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. దీంతో ప్రజలు అనారోగ్యం పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Update: 2022-11-05 03:13 GMT

దేశ రాజధానిలో ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. దీంతో ప్రజలు అనారోగ్యం పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాసకోస వ్యాధులు పడే అవకాశముందని చెప్పారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో 431 గా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అందుకే ప్రభుత్వం చిన్నారులు ఎలాంటి వ్యాధులు బారిన పడకుండా పాఠశాలలనునేటి నుంచి మూసివేసింది. ప్రైమరీ పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

అవుట్ డోర్ గేమ్స్....
అక్టోబర్, నవంబర్ నెలల్లో ఢిల్లీకి ఆనుకుని ఉన్న పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లో రైతులు వ్యవసాయ వ్యర్థ పదార్ధాలను తగుల బెడతారు. ఆ పొగంతా ఢిల్లీని కమ్మేస్తుంది. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగింది. అవుట్ డోర్ గేమ్స్ ను కూడా ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలోనే సరి, బేసి విధానంలో వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.


Tags:    

Similar News