Tamilnadu : నేడు డీలిమిటేషన్ పై చెన్నైలో అఖిలపక్ష సమావేశం
నేడు డీలిమిటేషన్ పై చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.;

నేడు డీలిమిటేషన్ పై చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. చెన్నైలోని చోళా హోటల్ లో ఈ సమావేశం జరగనుంి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగే అఖిలపక్ష సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు చెన్నైకి చేరుకున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ ఈఅఖిలపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో...
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు తమ ఉనికిని రాజకీయంగా కోల్పోయే ప్రమాదం ఉందని భావించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగే ఈ సమావేశంలో తమిళనాడు, తెలంగాణ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, భగవంత్ మాన్, పినరయి విజయన్ హాజరుకానున్నారు. కర్ణాటక నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ తో పాటు ఒడిశా నుంచి బీజేడీ, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు హాజరు కానున్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యతతో ఉండి ఎక్కువ పార్లమెంటు సీట్లు కోల్పోకుండా చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు.