నిరుద్యోగులకు గుడ్ న్యూస్... నెలకు 81 వేల వేతనంతో
భారత ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 327 పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది;

భారత ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 327 పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నెలకు పద్దెనిమిది వేల నుంచి 81 వేల రూపాయల వేతనం లభించనుుంది. పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వారు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈనెల 12వ తేదీ నుంచిదరఖాస్తు చేసుకునే వీలుంది.
దరఖాస్తు చేసుకోవడానికి...
దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ ఏప్రిల్ ఒకటోతేదీగా నిర్ణయించారు. కనీసంపదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మరిన్ని వివరాలకు joinindiannavy.gov.in వెబ్ సైట్ లో చూసి తెలుసుకోవచ్చు. త్వరగా దరఖాస్తు చేసుకుని మంచి వేతనంతో కలిగిన ఉద్యోగాన్ని పొందే అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.