ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు?

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Update: 2022-11-23 12:34 GMT

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ మొదలయిన మూడు రోజుల్లోనే కమిషన్ నియామకం జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ల నియామానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు ఏమిటని ప్రభుత్వం తరుపున న్యాయవాదిని ప్రశ్నించింది.

మార్గదర్శకాలు ఏంటి?
మార్గదర్శకాలు ఏంటో చెప్పాలని కోరింది. ఇటీవల అరుణ్ గోయల్ ను కేంద్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నియామకపత్రానికి సంబంధించిన ఉత్తర్వులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. శేషన్ లాంటి ఎన్నికల కమిషనర్ ఎందుకు లేరని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు తెలిసింది.


Tags:    

Similar News