అసోంలో మరోసారి భూకంపం
అసోంలో మరోసారి భూకంపం సంభవించింది. కాంరూప్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున భూమి కంపించినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
అసోంలో మరోసారి భూకంపం సంభవించింది. కాంరూప్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున భూమి కంపించినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు వెల్లడించారు. బుధవారం తెల్లవారు జామున 3.59 గంటలకు భూమి కంపిచండంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
వరస భూకంపాలతో...
వరస భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు చెందుతున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. గత నెల 14వతేదీన అసోంలోని నాగోస్ ప్రాంతంలో భూమి కంపించింది. మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళనకు గురి చెందుతున్నారు. అయితే భయాందోళనలు అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.