కొత్త వైరస్... కేరళలో అలజడి

కేరళలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. దీనిని నోరో వైరస్ అంటారు.

Update: 2022-06-06 04:12 GMT

దేశంలో రోజుకో కొత్త వైరస్ పుట్టుకొస్తుంది. దీంతో మరోసారి వైద్యరంగంలో ఆందోళన కలుగుతుంది. కేరళలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. దీనిని నోరో వైరస్ అంటారు. కేరళలోని ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకింది. తిరువనంతపురం నగరంలో ఈ కొత్త వైరస్ వెలుగు చూసింది. ఇది జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. వెంటనే దీనికి చికిత్స అందించకపోతే ప్రాణాంతకం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ వైరస్ సోకిన వారు....
ఇప్పటికే ఈ వైరస్ పట్ల కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. కలుషిత నీరు, ఆహారం ద్వారా కూడ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. నీటి శుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం కేరళ ప్రభుత్వం మొదలు పెట్టింది. అయితే కేరళలో నోరో వైరస్ సోకిన ఇద్దరు పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం తిన్న తర్వాతనే ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ సోకిన వారిలో ఒళ్లు నొప్పులు, తలనొప్పి, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తాయని వైద్యులు చెబుతున్నారు.


Tags:    

Similar News