అమ్మ మరణంపై సంచలన నివేదిక

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఆర్ముగం కమిటీ సంచలన విషయాలను వెల్లడించింది;

Update: 2022-10-18 08:06 GMT

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఆర్ముగం కమిటీ సంచలన విషయాలను వెల్లడించింది. మరణం సమయంలో జయలలిత, శశికళ మధ్య విభేదాలున్నాయని కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. 2012 నుంచే వీరి మధ్య విభేదాలున్నాయని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీలో ఈ నివేదికను ప్రభుత్వం బయటపెట్టింది. డాక్టర్ల తీరును కూడా కమిటీ తప్పు పట్టింది. ఆమె ఆరోగ్య విషయాలను శశికళ గోప్యంగా ఉంచారని, ఎవరినీ ఆసుపత్రిలోకి కూడా రానివ్వలేదని కమిటీ పేర్కొంది.

వైద్యం జరిగిన తీరు...
జయలలిత కు వైద్యం ట్రీట్‌మెంట్ అందించిన వైద్యుల తీరును కూడా కమిటీ తప్పు పట్టింది. జస్టిస్ ఆర్ముగ స్వామి కమిటీ ఐదు సంవత్సరాలుగా వివిధ రూపాల్లో విచారించింది. ఐదుగురు సభ్యుల కమిటీ దాదాపు 75 మందిని విచారించింది. అపోలో ఆసుపత్రి వైద్యుల నివేదిక ప్రకారం 2016 డిసెంబరు 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు జయలలిత మరణించిందని తెలిపింది.
సరైన వైద్యం...
డాక్టర్ కేఎస్ శివకుమార్, శశికళ, అప్పటి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తీరును కూడా ఆర్ముగం కమిటీ తప్పు పట్టింది. వీరిపై విచారణ చేపట్టాలని జస్టిస్ ఆర్ముగం కమిటీ కోరింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఎయిమ్స్ వైద్య బృందం సరైన చికిత్స అందించలేకపోయిందని అభిప్రాయపడింది. అమెనికా నుంచి వచ్చి డాక్టర్ సమీర్ శర్మ జయలలిత గుండెకు సర్జరీ చేయాలని సూచించినా అది జరగలేదని నివేదికలో పేర్కొన్నారు.


Tags:    

Similar News