సినిమా చూడండి : ఉద్యోగులకు హాఫ్ డే లీవ్
ప్రధాని సినిమా బాగుందని చెప్పడమే కాకుండా.. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రతిఒక్కరూ ఈ సినిమా చూడాలని చెప్పడం నిజంగా..
అస్సాం : "ది కాశ్మీర్ ఫైల్స్" మార్చి 11న విడుదలైన ఈ సినిమా.. అటు ఇండస్ట్రీతో పాటు ఇటు రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న "ది కాశ్మీర్ ఫైల్స్" ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని సైతం ఆకర్షిచింది. ప్రధాని సినిమా బాగుందని చెప్పడమే కాకుండా.. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రతిఒక్కరూ ఈ సినిమా చూడాలని చెప్పడం నిజంగా చెప్పుకోదగిన విషయం. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగానికి గురవుతున్నాడు. వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.
కాగా.. "ది కాశ్మీర్ ఫైల్స్" పై ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపి పాలిత రాష్ట్రాలు సినిమాపై వినోదపు పన్నును తొలగించాయి. తాజాగా అస్సాం ప్రభుత్వం ఈ సినిమా పై మరో సంచలన నిర్ణయం తీసుకుంది. "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ ప్రకటించింది. ఒక సినిమా చూడటం కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ప్రకటించి అందరినీ దృష్టిని ఆకర్షించింది అస్సాం. రూ.12 కోట్ల బడ్జెట్ తో.. కశ్మీరీ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యంతో తెరకెక్కిన "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.