Ayushman Bharat గుడ్ న్యూస్: ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. AB PM-JAY కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ హెల్త్ కవరేజీని పొడిగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలను పంచుకున్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కవరేజీ అందుతుందని తెలిపారు. ఇందులో ఇప్పటికే అనేక కుటుంబాలు ఉన్నాయని, అటువంటి కుటుంబాలలో సీనియర్ సిటిజన్లు ఉంటే, అదనపు కవరేజ్ దక్కుతుందని తెలిపారు. టాప్-అప్ కవరేజీ రూ. 5 లక్షలు ఉంటుందని వివరించారు. ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమాతో 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్‌లకు లబ్ధి చేకూర్చడం ఈ కవరేజీ లక్ష్యమని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS), ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ వంటి ఇతర ప్రజారోగ్య బీమా పథకాల ప్రయోజనాలను ఇప్పటికే పొందుతున్న 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లు () వారి ప్రస్తుత పథకాన్ని కొనసాగించవచ్చు లేదా CAPFAB-PMJAYని ఎంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన 12.34 కోట్ల కుటుంబాలకు సహాయంగా ఉంటుంది. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల ఆరోగ్య రక్షణను అందించే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. వయస్సుతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలలోని సభ్యులందరూ పథకం కిందకు వస్తారు. ఈ పథకం ద్వారా 49 శాతం మంది మహిళా లబ్ధిదారులు సహా 7.37 కోట్ల మంది ఆసుపత్రిలో చేరారు. ఈ పథకం కింద రూ.లక్ష కోట్లకు పైగా ప్రజలు లబ్ధిపొందినట్లు కేంద్ర ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.