ఈనెల 21న భారత్ బంద్
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాలు భారత్ కు బంద్ కు పిలుపునిచ్చాయి
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాలు భారత్ కు బంద్ కు పిలుపునిచ్చాయి. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చని తీర్పు చెప్పడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ వాదిస్తున్నారు.
ఉప వర్గీకరణ...
రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీం ఆదేశాలకు నిరసనగా ఈనెల 21న భారత్ బంద్ కు బహుజన సంఘాలు పిలుపునిచ్చాయి. భీమ్ సేన, ట్రైబల్ ఆర్మీ చీఫ్ పిలుపునకు వివిధ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీల్లోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడుతున్నాయి.