Bank Holidays August 2024: ఆగస్టులో బ్యాంకు హాలిడేస్.. ఎప్పుడంటే?

ఆగస్టు నెలలో బ్యాంకులకు సెలవులు చాలా ఎక్కువగానే

Update: 2024-07-25 05:40 GMT

ఆగస్టు నెలలో బ్యాంకులకు సెలవులు చాలా ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఆగస్ట్ నెలలో రెండు శనివారాలు కాకుండా, స్వాతంత్ర్య దినోత్సవం, రక్షా బంధన్ పండుగ కూడా వస్తుండడంతో బ్యాంకులతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు మూసివేయనున్నారు.

ఆగస్ట్ నెలలో రెండు శనివారాలు, స్వాతంత్ర్య దినోత్సవం, రక్షాబంధన్ కారణంగా బ్యాంకులకు సెలవులు ప్రకటించనున్నారు. ఆగస్టు నెల మొదటి వారంలో, ఆదివారం ఆగస్టు 4న బ్యాంకులు మూతపడతాయి. రెండవ శనివారం ఆగస్టు 10 న వస్తుంది. ఆగస్టు 11 ఆదివారం కారణంగా బ్యాంకులతో సహా వివిధ ప్రభుత్వ శాఖలు మూసివేయనున్నారు. ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం బ్యాంకులతో సహా అన్నిటినీ మూసివేయనున్నారు. మూడవ వారంలో ఆగస్టు 18 ఆదివారం. రక్షాబంధన్ పండుగ కారణంగా ఆగస్టు 19న సెలవు ఉంటుంది. ఆగస్ట్ 24 నెలలో నాల్గవ శనివారం. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. మరుసటి రోజు ఆగస్టు 25 ఆదివారం సెలవు. ఆగస్టు 26న జన్మాష్టమి. 30 రోజుల్లో 9 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.


Tags:    

Similar News