గవర్నర్ వద్దకు నితీష్.. అందుకేనా?
కాసేపట్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్ ను కలవనున్నారు. ఆయన అపాయింట్‌మెంట్ తీసుకున్నారు
కాసేపట్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్ ను కలవనున్నారు. ఆయన అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. తాము బీజేపీతో పొత్తు నుంచి తప్పుకుంటున్నామని చెబితే నితీష్ కుమార్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. అయితే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అన్నది కాసేపట్లో తెలియనుంది. ఆయన రాజీనామా చేసి తిరిగి ఎన్నికవుతారన్న ప్రచారం జరుగుతుంది.
షా మాట్లాడినా....
బీజేపీతో తెగదెంపులకు నితీష్ కుమార్ సిద్ధమవ్వడంతో కేబినెట్ లో ఉన్న 16 మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేయనున్నారు. అయితే చివరి ప్రయత్నంగా నితీష్ కుమార్ తో అమిత్ షా మాట్లాడినట్లు తెలిసింది. అయినా నితీష్ మాత్రం బీజేపీ నుంచి విడిపోయేందుకే సిద్ధమయ్యారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఆర్జేడీ, కాంగ్రెస్ లు నితీష్ కు తమ మద్దతును ప్రకటించాయి. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము మద్దతిస్తామని తెలిపాయి.