మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హోరాహోరీ

ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే అధికార BJP, ప్రతిపక్ష కాంగ్రెస్ చాలా

Update: 2023-12-03 03:33 GMT

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం మొదటగా పోస్టల్ బ్యాలెట్లు తెరిచారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే అధికార BJP, ప్రతిపక్ష కాంగ్రెస్ చాలా హోరా హోరీగానే ఆధిక్యంలో ఉన్నాయి. ఉదయం 8.50 గంటలకు బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో ఉంది, కాంగ్రెస్ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఇద్దరూ ముందున్నారు. బీఎస్పీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ 41, బీజేపీ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. చత్తీస్‌గఢ్‌‌లో కాంగ్రెస్ 26, బీజేపీ 21, తెలంగాణ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ 24, బీఆర్ఎస్12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. బీజేపీకి ఇక్కడ 140 నుంచి 162 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 68 నుంచి 90 స్థానాలు వస్తాయని పోల్స్ చెప్పాయి. ఇంకొన్ని గంటల్లో అసలైన ఫలితాలు రానున్నాయి.


Tags:    

Similar News