Odisha : సర్పంచ్ నుంచి సీఎం పదవి వరకూ.. రాజకీయ ప్రస్థానం అదిరిపోలా
ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది. ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీని శాసనసభ పక్షం ఎన్నుకుంది
ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది. ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీని శాసనసభ పక్షం ఎన్నుకుంది. ఒడిశాలో సుదీర్ఘకాలం బిజూ జనతాదళ్ పాలన సాగింది. అందులో రెండున్నర దశాబ్దాలు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఒడిశాలో బీజేడీ అధికారంలోకి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి పదవికి మోహన్ చరణ మాఝీ పేరును కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రులుగా కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవటి పరిదాలను ఎంపిక చేశారు.
రెండున్నర దశాబ్దాల తర్వాత...
బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. మోహన్ చరణ‌్ మాఝీ 1997 నుంచి 2000 వరకూ సర్పంచ్ గా పనిచేశారు. తొలిసారి 2000 లో ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్ారు. 2009, 2019 ఎన్నికల్లో వరసగా విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కియోంజర్ స్థానం నుంచి గెలిచిన మోహన్ చరణ‌్ మాఝీ గిరిజన నేతగా ఎదిగారు. రేపు సాయంత్రం ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.