బీజేపీ సభ్యులకు విప్ జారీ... ఎందుకంటే?
రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. నేడు సభకు ఖచ్చితంగా హాజరు కావాలని విప్ లో కోరింది.
రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. నేడు సభకు ఖచ్చితంగా హాజరు కావాలని విప్ లో కోరింది. పార్లమెంటు సమావేశాలు నేడు ప్రారంభం కాబోతున్నాయి, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగిస్తుండటంతో సభ్యులందరూ ఖచ్చితంగా హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది.
షా ప్రకటన....
మరోవైపు నేడు లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేయనున్నారు. ఇటీవల ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై జరిపిన కాల్పుల ఘటనపై అమిత్ షా ప్రకటన చేయననున్నారు. ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అసద్ కు జడ్ కేటగిరి భద్రత ఇస్తామన్నా ఆయన ఒప్పుకోలేదు. దీనిపై అమిత్ షా ప్రకటన చేయనున్నారు.