నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాల దిశగా

కేంద్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది;

Update: 2025-01-16 02:19 GMT

కేంద్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు అంశాలపై కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారికవర్గాలు వెల్లడించాయి.

కీలక అంశాలపై...
ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముందని తెలిసింది. ఉద్యోగులకు సంబంధించి కొన్ని నిర్ణయాలను కేబినెట్ తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే సమయంలో రైతులు, విద్యార్థులకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని అధికారికవర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News