ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.;
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం రెండు విడతలుగా పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది. తొలివిడతగా ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు.
రెండు విడతలుగా....
ఫిబ్రవరి ఒకటోతేదీన ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన బడ్జెట్ సమావేశాలు వాయిదా పడతాయి. తిరిగి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకూ రెండో విడత సమావేశాలు జరుగుతాయి. కరోనా తీవ్రత దృష్ట్యా పార్లమెంటు సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఇటీవల పార్లమెంటు సిబ్బంది 150 మందికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.