భారత్ లో తగ్గుతున్న కరోనా

దేశంలో కరోనా వైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులో 5,910 మంది కరోనా బారిన పడ్డారు

Update: 2022-09-05 05:24 GMT

దేశంలో కరోనా వైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులో 5,910 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్కరోజులోనే 7,034 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నిన్న మొన్నటి వరకూ పదివేల కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే చాలా రోజుల తర్వాత ఆరువేలకు ఈ సంఖ్య చేరుకోవడం కొంత శుభపరిణామం. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.69 శాతంగా నమోదయింది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తగ్గుతున్న యాక్టివ్ కేసులు...
మరో వైపు యాక్టివ్ కేసుల 0.12 శాతానికి తగ్గింది. దేశంలో ఇప్పటి వరకూ 4,44,62,445 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,38,80,464 మంది వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,28,007 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 53,974 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 213.52 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News